ఓ కైలాసహిమగిరి శంకరా... శివ భజన పాటల లిరిక్స్

 ఓ కైలాసహిమగిరి శంకరా...

కనికరం ఉంచరా, మనసార మోము చూపించరా 

|| ఓ ||

నీలకంఠా నిను చూడగోరి నిరతము నిను ప్రార్ధించితి 
జగతినేతా జాగేల మాపై.... జ్యోతులివిగో జగమేలరా
కనికరం ఉంచరా, మనసార మోము చూపించరా

చంద్రమౌళీ చితభస్మధారీ చంద్రకిరణాల తేజోవిహారీ
దండమోయి  ఓ లింగధారీ... నిండుగొలిపే చర్మాంబరీ
కనికరం ఉంచరా, మనసార మోము చూపించరా

మనసు నిలిపిన మహనీయులందరు జన్మ సద్గతి కావించిరి కానరాని కలిమాయలోన... కారడవిలో పడియుంటిరా
కనికరం ఉంచరా, మనసారా మోము చూపించరా

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow