నా గీతమే నీకు సంగీతము - శివ భజన పాటల లిరిక్స్

 నా గీతమే నీకు సంగీతము

నా భావమే నీకు సాహిత్యము శివ
 మహనందీశ్వరా మహాదేవ దేవ.  

౹౹నా గీతమే౹౹

మేళములు జన్యములు ఆ సప్త స్వరములు
గానములు గమకములు నే నెరుగను శివా - 2
భక్తి భావమే కాని అన్యమేమియూ లేని - 2
శరణాగతుడను నీ పాదదాసుడను.

౹౹నా గీతమే౹౹

ఓంకార నాదమున నెలకొన్న వాడవని
పంచాక్షరి పఠనమే చేతురా భవా - 2
కామక్రోధరహిత మహానందీశ్వరా - 2
వినిపింతురా నీ నామకీర్తనులు.   

౹౹నా గీతమే౹౹


#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow