దేవా నీమాయ తెలియ నలవిగాదు

 దేవా నీమాయ తెలియ నలవిగాదు

భావభేదముల భ్రమసితిని


జననంబొకటే జంతుకులమొకటే

తనువికారములే తగఁ బెక్కు

దినములు నివియే తివిరి లోకమిదె

పనులే వేరయి పరగీని


మాఁటలు నొకటే మనసులు నొకటే

కోటులసంఖ్యలు గుణము లివి

కూటము లిట్లనె గురిఁ గాముఁ డొకఁడె

మేటివలపులకె మేరలే లేవు


జ్ఞానమొకటే యజ్ఞానము నొకటే

నానామతములు నడచీని

ఆనుక శ్రీవేంకటాధిప నీకృప

తానే మమ్మిటు తగఁ గాచీని 🙏🙏🙏

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow