అవధారు దేవ హరికుల రామ

 అవధారు దేవ హరికుల రామ

వివిధమై నీబంటు వెలయుచున్నాడు llఅవధారుll


అదె కలశాపుర హనుమంత రాయడు

కదనము లోన రక్కసుల గొట్టి

యెదుట నిందరి లోన నేకాంగవీరుడై

కొదలేక ప్రతాపించి కొలువైవున్నాడు llఅవధారుll


చల్లని వనాల నీడ సాగుడు కొండలలోన

వల్లెగా వేసుకొన్న వాలముతోడ

పల్లదాన వలకేలు పంతమున నెత్తుకొని

కొల్లున మంటపములో కొలువై వున్నాడు llఅవధారుll


పెక్కు పండ్ల గొలలు పిడికిట  బట్టుకొని

చక్కగా పెరిగి పెద్దజంగ చాచి

యిక్కువ శ్రీవేంకటాద్రి నిరవైన సర్వేశ

గుక్కక నీపై భక్తి గొలువై వున్నాడు ll అవధారుll🙏🙏🙏

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow