@ స్వామి నొదల బోకయ్యా @ గురు స్వామి నొదల బోకయ్య @ అయ్యప్ప భజన పాటల లిరిక్స్

స్వామి నొడల బోకయ్యా - అయ్యప్ప భక్తి గీతం
స్వామి అయ్యప్ప

🙏 స్వామియే శరణమయ్యప్ప 🙏

స్వామి నొడల బోకయ్యా గురుస్వామి నొదల బోకయ్యా
ఓ కన్నె స్వామి!

గురుస్వామి లేనిదే గుట్టలెక్కలేవయా
శరణాలు పలకనిదే శబరియాత్ర చేయలేవు.
శరణాలే చెప్పవయ్యా.......శబరియాత్ర చేయాలయ్యా
ఓ కన్నె స్వామి!

ఇరుముడిని ఎత్తుకొని ఎరిమేళి చేరుకొని
వేశాలు వేయాలయ్యా పేటతుళ్ళి ఆడాలయ్యా

అలుదాలో స్నామాడి, అలుదమేడే ఎక్కుతుంటే
అలసి పోతున్నా మయ్య, మేము అలిసిపోతున్నా మయ్యా గురుస్వామి

కఠిన కఠిన మంటూనే కరిమల ఎక్కుతుంటే
కాలుజారి పోతోందయ్యా, మా కాలు జారి పోతుదోయ్యా గురుస్వామి

పంబలో స్నామాడి నీలిమల ఎక్కుతుంటే
నీరుకారి పోతోందయ్యా, చమట నీరుకారి పోతుందయ్యా గురుస్వామి

శరణ శరణ మనుకుంటూ శరణగత్తి చేరుకొని
శరణులనే గ్రుచ్చాలయ్యా, శరణుఘోష చేయాలయ్యా
ఓ కన్నె స్వామి!

సన్నిధానం చేరుకొని పదునెనిమిది మెట్లెక్కి
అభిషేకం చేయాలయ్యా... అభిషేకం చేయాలయ్యా నా స్వామి

స్వామి నొదలబోకయ్యా గురుస్వామి నోదలబోకయ్యా

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow