ఏమి మాయరా బ్రతుకు తెలుసు కొమ్మురా - శివ భజన పాటల లిరిక్స్

 ఏమి మాయరా బ్రతుకు తెలుసు కొమ్మురా జీవ

ఇది ఏమి మాయరా బ్రతుకు తెలుసు కొమ్మురా జీవ

సంసారమె సాగరమూ అందులోన నావ నీవు
ఏ గాలీ వీచునో ఏ తాకిడి తాకునో
చివరకు నీవేమౌదువొ తెలుసుకొమ్మురా జీవ

ఉన్ననాడు నీ వారూ లేని నాడు ఎవరు కారు.
తనవారూ యెవ్వరో పరవారూ యెవ్వరో
చివరకు నీ వెంటవచ్చు వారెవరురా జీవ
.
నాది నాది యన్నదీ నీదేదీ కాదురా
వయసేమో పెరుగును మరణమేమొ చేరును
ఇకమైనా మేలుకొని రాము భజన చేయరా

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow