@ స్వామిని నమ్ముదమా.@. గురుస్వామిుని నమ్ముదమా...@ గురువు భజన పాటల లిరిక్స్@

స్వామిని నమ్ముదమా - గురుస్వామి భక్తి గీతం

🙏 స్వామిని నమ్ముదమా 🙏

స్వామిని నమ్ముదమా... గురుస్వామిని నమ్ముదమా........

స్వామిని నమ్ముదమా... గురు స్వామిని నమ్ముదమా

మాల వేసి నియమాలను తెలిపే స్వామిని నమ్ముదమా....

మన గురు స్వామిని నమ్ముదమా... //2//

జన్మకర్మమును తెలుసుకోమనెను, తల్లి తండ్రులను మరువవద్దనెను

ముక్తి కొరకు భగవంతుని వేడగా, మనసును మంత్రము చేయమనెను

భక్తితోటి భగవంతుని కొలువగ, గురువుగ తానే దర్శనమయ్యెను.

స్వామిని నమ్ముదమా...

కామక్రోధ మద లోభములొదటగా, స్వామి మాలతో దారి జూపెను...

అంబ వైపు పాదాలు సాగగా, వనయాత్రలో వెంట నడిచెను..

భక్తితోటి పరమాత్మను వేడగా, గురువుగ తానే దర్శనమయ్యెను.

స్వామిని నమ్ముదమా....

మంచి మార్గముపదేశమిచ్చెను, మానవ సేవలో నిలువుమనెను

సనాతన ధర్మాలను చూపి, సమ భావనతో మెలుగమనెను

తల్లితండ్రి తర్వాత ఎవరనగా, గురువుగ తానే దైవమయ్యెను.

స్వామిని నమ్ముదమా....

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow