71 విజయవాడలో కొలువు తీరిన - అమ్మవారి భజన పాటల లిరిక్స్

 విజయవాడలో కొలువు తీరిన

అమ్మా దుర్గమ్మా మాయమ్మా దుర్గమ్మా
చల్లగ రావమ్మా ఘల్లుఘల్లున రావమ్మా

పసుపు కుంకుమ పూలు దెచ్చి పండ్లు ఫలములు ముందు ఉంచి
పూజ చేసేము తల్లీ సేవ చేసేము
చల్లగ రావమ్మా ఘల్లు ఘల్లున రావమ్మా

ఎంతగానో వేడినాము ఆర్తితో నిను పిలచినాము
పంతమేలమ్మా తల్లీ దయను చూపమ్మా

భక్తులంతా సేవ చేసి శక్తి కొలది పూజ చేసి
అలసి ఉన్నారు నీకై నిలచి ఉన్నారు

విన్నపాలు ఆలకించి వరములిచ్చే ఆదిశక్తి
ఆదుకోవమ్మా తల్లీ అమ్మ నీవమ్మా

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow