70 ఆడుకో దుర్గమ్మా నువ్వాడుకో - అమ్మవారి భజన పాటల లిరిక్స్

 ఆడుకో దుర్గమ్మా నువ్వాడుకో

బెజవాడ పురములోన నువ్వాడుకో
ఆడుకో దుర్గమ్మా నువ్వాడుకో
కృష్ణవేణి తీరాన నువ్వాడుకో

ఆడుకో దుర్గమ్మా ఆడుకోవమ్మా
బెజవాడ పురములోన ఆడుకోవమ్మా

గణగణగణ గంటలతో నువ్వాడుకో
ఢమఢమఢమ డప్పులతో నువ్వాడుకో
శంఖు నాదాలతోటి నువ్వాడుకో
సింహ గర్జనల తోటి నువ్వాడుకో

ఎర్రాని గాజులేసి నువ్వాడుకో
కాళ్ళకు గజ్జెలు కట్టి నువ్వాడుకో
పట్టుచీర కట్టుకొని నువ్వాడుకో
బంగారు కోవెలలో నువ్వాడుకో

మహిషాసుర మర్దినివై నువ్వాడుకో
త్రిశూలం చేతబట్టి నువ్వాడుకో
పెద్ద పులి మీద ఎక్కి నువ్వాడుకో
నవ దుర్గల రూపంలో నువ్వాడుకో

కంచి కామాక్షివై నువ్వాడుకో
మధుర మీనాక్షివై నువ్వాడుకో
కన్యాకుమారివై  నువ్వాడుకో
కాశి విశాలాక్షివై నువ్వాడుకో

ఇంద్రకీలాద్రిపై నువ్వాడుకో
శ్రీశైలం కొండపై నువ్వాడుకో
మల్లన్న తోడుగా  నువ్వాడుకో
నాగన్న నీడలో నువ్వాడుకో

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow