@ తుమ్మెద ఓ తుమ్మెద @ ఎంత తుంటరోడే గోవిందుడు తుమ్మెద @ Tummeda o tummeda -

```html

🦚 తుమ్మెద ఓ తుమ్మెద 🦚

శ్రీకృష్ణ భక్తి గీతం

తుమ్మెద ఓ తుమ్మెద !
ఎంత తుంటరోడే గోవిందుడు తుమ్మెద !

ఓ యశోదమ్మ నీ కొడుకు తుమ్మెద !
ఎంత తుంటరోడే గోవిందుడు తుమ్మెద

॥ తుమ్మెదా ॥

వెన్న తిన్న నోటితోనే ! మన్ను తింటా ఉన్నాడు (2)

వాని పట్టుకుందాం అంటే వాడు చిక్కడు వాడు !

॥ తుమ్మెదా ॥

అల్లరి వాడన్నారు చల్లరివాడు అన్నారు (2)

అల్లరి అంత చేసి వాడు ! అమ్మను ఏడ్పించాడు...

॥ తుమ్మెదా ॥

గోవర్ధనగిరి నెత్తి గోవులను కాపాడినాడు (2)

యశోదమ్మ ఇంటిలో ఏ మూలన దాగినాడో...

॥ తుమ్మెదా ॥

నారాయణ అవతారం ! శ్రీకృష్ణుని నామాలు (2)

కంసుని అల్లుడంట వాసుదేవుని కొడుకంటా......

॥ తుమ్మెదా ॥
✦ ఈ లిరిక్స్ పంపినవారు ✦
బైరంపల్లి భజన మండలి
మిడ్జిల్ మండలం - మహబూబ్ నగర్ జిల్లా
🦚 శ్రీకృష్ణార్పణమస్తు 🦚
```

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow