ఏల మాటాడవే । ఓ రామయ్యా...!। యెంత కఠినుడవే
ఏల నీ దయ రాకయున్నది-ఏమి సేయ దలంచినాడవు
నీలవర్ణా నీదు సత్కృప-చాలగా మది నమ్మినాడను ॥
నీకే చేయి జాచితి | లోకులనెల్ల | జూచి వేసారితి
జోకతో నీవాడ ననుచును-చూచి చూడ వదేమిచిత్రము
నీ కటాక్షము సోకకను యెం-దాక యోర్తును లోక సుందర
॥ఏల॥
మ్రొక్కి వేసారితి । నామనసందు। ముందె నిను గోరితి
గ్రక్కున నన్నాదరించెడు-ఘనుడ వనుచును వేడుకొంటివి
ఒక్కసారి నాదు చిత్తము-ఓప దాయెను ముచ్చటాడవె
॥ఏల॥
సంతసించగదే । రాకమచెర్ల | స్వామి నీవె గదే
వంతుకైనను కరుణ జూడవు-ఓపజాలను నామనంబున
పంతమేమి దలంచకుర నీ-బంట నైతిని ధర్మసాక్షిగ ॥ఏల॥