గణనాథ ఏలుమయ
గణనాథ ఏలుమయ - ఎంతటి చల్లని స్వామివయా
భజియింతు నీ నామమే దేవా - పాలించ రావేమయా
గణనాథ ఏలుమయ - ఎంతటి చల్లని స్వామివయా
భజియింతు నీ నామమే దేవా - పాలించ రావేమయా
|| గణ నాథ ||
అనతి తల్లిది నువ్వు వినగానే - ఆజ్ఞకై నిలచి ఉంటివి స్వామి
అనతి తల్లిది నువ్వు వినగానే - ఆజ్ఞకై నిలచి ఉంటివి స్వామి
భజియింతు నీ నామమే దేవా - పాలించ రావేమయా
|| కోరస్ ||
శివుడే వచ్చిన బెదరక నీవు - శక్తి తోడ నీవే ఎదిరించినావే
శివుడే వచ్చిన బెదరక నీవు - శక్తి తోడ నీవే ఎదిరించినావే
భజియింతు నీ నామమే దేవా - పాలించ రావేమయా
|| కోరస్ ||
ఎంతటి వీరుడ నిన్నూ మరువజాలం - ఏమని పొగడము నీ లీల సారం
నేనంత వాడనయా దేవా - పాలించ రావేమయా
|| గణ నాథ ||
నీ పుణ్య నామము తలచిన చాలు - నిను కొలిచిన స్వామి కలుగు మేలు
నీ పుణ్య నామము తలచిన చాలు - నిను కొలిచిన స్వామి కలుగు మేలు
భజియింతు నీ నామమే దేవా - పాలించ రావేమయా
|| కోరస్ ||
నీ బొజ్జ రూపం ఆనంద తేజం - భవ సాగరముల దొరుకును తీరం
నీ బొజ్జ రూపం ఆనంద తేజం - భవ సాగరముల దొరుకును తీరం
భజియింతు నీ నామమే దేవా - పాలించ రావేమయా
|| కోరస్ ||
ప్రతి దినం నిన్ను తలచిన వాళ్ళం - పాడుకొందుము ప్రభు నీదు నామం
మా ఇలవేల్పువయా స్వామి - లాలించ రావేమయా
|| గణ నాథ ||
🙏 ఓం గం గణపతయే నమః 🙏