@పాహి పాహి పార్వతినందన@ paahi paahi Parvathi nandana @-వినాయక భజన పాటల లిరిక్స్

శుక్లాంబరధరం విష్ణుం

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోప శాంతయే

॥ శుక్లాంబరధరం ॥

పాహి పాహి పార్వతి నందన - ప్రణవ స్వరూపా వేగమెరారా
మొదటి పూజ నీకే చేతుము - స్వీకరించరా గణపతి దేవా

కుడుములు ఉండ్రాళ్ళనూ - హే - హే
ఆరగించరావాలయ్యా - స్వామీ
వడపప్పు పానకాలనూ - హే - హే
స్వీకరించరావాలయ్యా - తండ్రీ

అడవిలోని పత్రి తెచ్చి - పూజలు చేసేమయ్యా
ఆదరించి ఆదుకోర - బుజ్జి గణపయ్యా

గణపతి బప్పా - మోరియా

ఓ బొజ్జ గణపయ్యా - వినాయక
నీ బంటు నేనయ్యా - వినాయక
విఘ్నము తొలగించి - వినాయక
విజయము నందించు - వినాయక

॥ శుక్లాంబరధరం ॥

సిద్ధి బుద్ధి రూపము నీవే - సిరులనొసగే శ్రీ గణనాధా
విజయమొసగే విఘ్న వినాయక - కంటిరెప్పై కాపాడయ్యా

చిట్టి ఎలుక మీద ఎక్కి - హై - హై
లోకాలూ తిరిగేవయ్యా - స్వామీ
చిరునవ్వు లొలకబోయుతూ - హై - హై
అభయమిచ్చి రక్షించయ్యా - తండ్రీ

భక్తులను కాపాడే - బంగారు దేవుడా
కాణిపాకం దేవా - కరుణించరావ

గణపతి బప్పా - మోరియా

శ్రీకర శుభకరుడా - వినాయక
శ్రీ లక్ష్మి గణనాధా - వినాయక
కాణిపాక దేవా - వినాయక
కాపాడగరావా - వినాయక

॥ పల్లవి మొత్తం ॥

శరణం శరణం - గణేశ శరణం
విఘ్నరాజ శరణం - గణేశ శరణం
దండాలయ్యా - ఉండ్రాళ్ళయ్యా
అండా దండా ఉండాలయ్యా

మూషిక వాహన - వినాయకా
మోదక హస్తా - వినాయకా
అయ్యప్ప సోదర - వినాయకా
ఆరుముగ సోదర - వినాయకా

గౌరీ నందన - వినాయకా
గిరిజా నందన - వినాయకా
పార్వతి నందన - వినాయకా
పాద నమస్తే - వినాయకా

కాణిపాక దేవా - వినాయకా
కరుణించయ్యా - వినాయకా
కన్నె మూల గణపతి - వినాయకా
కాపాడయ్యా - వినాయకా

శరణం శరణం - గణేశ శరణం
విఘ్నరాజ శరణం - గణేశ శరణం

జై బోలో గణేష్ మహరాజ్ కి

కాణిపాక వరసిద్ధి వినాయకునకు
కన్నె మూల గణపతి భగవనే శరణం అయ్యప్ప

🙏 స్వామియే శరణం అయ్యప్పా 🙏
🙏 ఓం గం గణపతయే నమః 🙏

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow