ఘుకుల తిలకా రారా నిన్ను ఎత్తి ముద్దులాడేదరా //2//
కోసల రామ రారా కౌసల్యా తనయా రారా //2//||రఘు/
నుదుటన కస్తూరి తిలకం చిరునవ్వుల చిందే అదరంమల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసేద రారా. //2//
||రఘు||
వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితి రారా //2//అల్లరి చేయక మాని నువ్వు ఆరగించను రారా //2//
||రఘు||
బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక దిద్ది //2//మా మనసును మాలగా గట్టి నీ మెడలో వేసేద రారా. //2//
||రఘ||