Gallu galluna ravemaiah Ganesha. గల్లు గల్లున రావేమయ్యా గణేశా - @ -వినాయక భజన పాటల లిరిక్స్

గల్లు గల్లున రావేమయ్యా - Gallu Galluna Ravemmaya
🐘

గల్లు గల్లున రావేమయ్యా

శ్రీ గణేశ జానపద కీర్తన

పల్లవి

గల్లు గల్లున రావేమయ్యా గణేశా

మా పూజలందుకో వయా గణేశా

1

పార్వతమ్మ పుత్రుడవు గణేశా

మమ్ము పాలించగ రావయా గణేశా

❋ ❋ ❋
2

కళియుగ వరదుడవే గణేశా

మమ్ము కరుణించగ రావయా గణేశా

❋ ❋ ❋
3

ముగ్గురన్నదమ్ములట గణేశా

నీకు ముందుగానే పూజలట గణేశా

❋ ❋ ❋
4

ఆది దేవుడవయ్యా గణేశా

నీవు అగ్రపూజలందుకోవయా గణేశా

❋ ❋ ❋
5

ఎలుక వాహనుడా గణేశా

మమ్ము ఏలుకోనగ రావేమయా గణేశా

❋ ❋ ❋
6

ఆరు ముగ సోదరుడవే గణేశా

మమ్ము ఆదుకొనగ రావేమయా గణేశా

|| గల్లు ||
(పల్లవికి తిరిగి వెళ్ళండి)

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow