@బంగారు కొండపై రంగైనరూపము@ Bangaru kondapai rangaina roopamu@ అయ్యప్ప స్వామి భజన పాటల లిరిక్స్

బంగారు కొండపై రంగైన రూపము
జ్యోతి స్వరూపము మాకపురూపము
ఈ కన్నులే చాలవు నిన్ను చూడ
మాటలే రావు నిన్ను కొనియాడ
|| బంగారు ||
చందన ఛాయలో చిందిన రాగాలు
విభూతి రేఖలలో విరజల్లు భోగాలు
చిరునవ్వులొలికించు నీ మోము
మరియెంత చూసినా మరలి రాలేము
|| బంగారు ||
మకర సంక్రాంతిలో జ్యోతిని తిలకించి
ఒడలు పులకించి కనులు ముకుళించి
మనసే కరిగింది మంచువోలె
తనువే విరిసింది తలిరువోలె
|| బంగారు ||
గాలిలో నీ లీల లీనమై తాకగా
దారిలో విధి దారిగా పాకగా
పాపాలు పోయేయి పటాపంచలై
దోషాలు తొలిగేయి తునాతునకలై
|| బంగారు ||
నీ భక్తి పాటలే బాటలై నడిపిస్తే
నీ పాద దాసులే చేయూతనిస్తుంటే
కులమత భేదాలు కూలిపోవా
తర తమ తేడాలు తరలి పోవా
|| బంగారు ||
నీలాల వలువలు నీ కొండ కప్పగా
ఇరుముడి మూటలే నీ కొండ నిండగా
ఈర్ష్యలు స్వార్థాలు ఇగిరిపోవా
మదమాత్సర్యాలు మాసిపోవా
|| బంగారు ||
```

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow