09. ఓం నారసింహాయ ఓం నారసింహాయ - Om narasimhaya Om narasimhaya - నరసింహ స్వామి భజన పాటల లిరిక్స్

 ఓం నారసింహాయ ఓం నారసింహాయ

ఓం నారసింహాయ ఓం నారసింహాయ
ఓం నారసింహాయ ఉగ్ర నారసింహాయ
జ్వాలా నారసింహాయ లక్ష్మి నారసింహాయ.
"ఓం నారసింహాయ"
ఇందు గలడు అందు లేడను సందేహము వలదంట
ఎందు ఎందు వెతికినా అందందే కలవంట
"ఓం నారసింహాయ"
రామ నారసింహాయ కృష్ణ నారసింహాయ
వైద్య నారసింహాయ విద్యా నారసింహాయ
ప్రహ్లాదుని కోసము పరుగున వస్తివంట
మమ్ము కావగా ఎల నీవు రావంటా
"ఓం నారసింహాయ"
వరాహ నారసింహ వామన నారసింహ
సుగ్రీవ నారసింహ హయగ్రీవ నారసింహ
శంఖు చక్రాలతోటి చతృభాహువులతోటి
భువి పైన వెలసినా నారాయణుడవు నీవంట
"ఓం నారసింహాయ"

లిరిక్స్ పంపిన వారు:
P. NAGARAJU

SRI RAJYALAKSHMI CHENCHULAKSHMI SAMETHA YOGANANDA LAKSHMI NARASIMHA SWAMY TEMPLE, IKKURRU, NARASARAOPET, PALNADU DISTRICT

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow