శ్రీ సత్యనారాయణ మీ సేవకు రారమ్మ, Telugu Lyrics Of Satyanarayana Swamy Aarati


 Telugu Lyrics Of Satyanarayana Swamy Aarati


శ్రీ సత్యనారాయణ మీ సేవకు రారమ్మ,


మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ.|


నోచిన వారికి - నోచిన వరము,


చూసిన వారికి - చూసిన ఫలము.||




శ్రీ సత్యనారాయణ మీ సేవకు రారమ్మ,


మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ.|




స్వామిని పూజించే - చెచేతులే చేతులట,


ఆ మూర్తిని దర్శించే - కనులే కన్నులట;


తన కథ వింటే ఎవ్వరికయినా ...


జన్మ తరించునటా...||1||




శ్రీ సత్యనారాయణ మీ సేవకు రారమ్మ,


మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ.|




ఏ వేళ అయినా - ఏ శుభమైనా,


కొలిచే దైవం - ఈ దైవం;


అన్నవరం లో వెలసిన దైవం,


ప్రతి ఇంటికి దైవం.||2||




శ్రీ సత్యనారాయణ మీ సేవకు రారమ్మ,


మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ.|




అర్చణ చేదామా - మనసు అర్పణ చేదామా,


స్వామిని మదిలోనే - కోవెల కడదామా;


పది కాలాలు పసుపు కుంకుమలు...


ఇమ్మని కొరేనా ...||3||




శ్రీ సత్యనారాయణ మీ సేవకు రారమ్మ,


మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ.|




మంగళమనరమ్మా - జయ మంగళమనరమ్మా,


కరములు జోడించి - శ్రీ నందనమలరించి;


మంగళమగు - శ్రీ సుందర మూర్తికి...


వందన మనరమ్మా... ||4||




శ్రీ సత్యనారాయణ మీ సేవకు రారమ్మ,


మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ.|


నోచిన వారికి - నోచిన వరము,


చూసిన వారికి - చూసిన ఫలము.||




శ్రీ సత్యనారాయణ మీ సేవకు రారమ్మ,


మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ.|


#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow