🕉️ స్వామియే శరణం అయ్యప్ప 🕉️
చూడాలనున్న దయా
చూచి తరియించు భాగ్యమయా
చూచి తరియించు భాగ్యమయా
నిన్ను చూడాలననుకుంటే
వేవేల జన్మాల పుణ్యం వెంటుండాలయ్యా
వేవేల జన్మాల పుణ్యం వెంటుండాలయ్యా
🕉️ || చూడాలనున్న దయా || 🕉️
స్వామియే శరణమయ్యప్పా
స్వామియే శరణమయ్యప్పా ॥2॥
స్వామియే శరణమయ్యప్పా ॥2॥
🌺 చరణం 1 🌺
ఆ శబరి గిరిపై... ఓహో... ఓహో! ... ఓహో! ఓహో!
ఆ! శబరి గిరిపైన నీ! గర్భ గుడిలోన నిను చేరె
ఆ! నీటి బిందువుకున్నంత
నీ పూజ చేసేటి పత్రంకున్నంత
నీ! పాదముల చెంత పువ్వుల కున్నంత
ఆ! నీటి బిందువుకున్నంత
నీ పూజ చేసేటి పత్రంకున్నంత
నీ! పాదముల చెంత పువ్వుల కున్నంత
ఆ! పాటి భాగ్యము మాకేది స్వామి
మరుజన్మ మాకుంటే కలిగించు స్వామి
మణికంఠ స్వామి
మరుజన్మ మాకుంటే కలిగించు స్వామి
మణికంఠ స్వామి
స్వామియే శరణమయ్యప్పా
స్వామియే శరణమయ్యప్పా ॥2॥
స్వామియే శరణమయ్యప్పా ॥2॥
🕉️ || చూడాలనున్న దయా || 🕉️
🌺 చరణం 2 🌺
తనువున్న వరకు... ఓహో... ఓహో! ... ఓహో! ... ఓహో!
తనువున్న వరకు నీ! కొండకొస్తా
నిండైన రూపాన్ని నే! చూసి వస్తా
ఒకవేళ నీ! కొండ రాలేకపోతే
గుడ్డుడినై నా! కంట నిన్ను చూడకుంటే
నిండైన రూపాన్ని నే! చూసి వస్తా
ఒకవేళ నీ! కొండ రాలేకపోతే
గుడ్డుడినై నా! కంట నిన్ను చూడకుంటే
అంతటితో ఈ! జన్మ చాలించు స్వామి
నీ! పాదముల చెంత చోటివ్వు స్వామి
మణికంఠ స్వామి
నీ! పాదముల చెంత చోటివ్వు స్వామి
మణికంఠ స్వామి
స్వామియే శరణమయ్యప్పా
స్వామియే శరణమయ్యప్పా ॥2॥
స్వామియే శరణమయ్యప్పా ॥2॥
🕉️ || చూడాలనున్న దయా || 🕉️
🌺 చరణం 3 🌺
కనులుండి కూడా... ఓహో... ఓహో! ... ఓహో! ... ఓహో!
కనులుండి కూడా కబోదైనాను
మంచేదో చెడుయేదో తెలియక ఉన్నాను
మంచేదో చెడుయేదో తెలియక ఉన్నాను
పాపాల పుట్టోలె పెరుగుతు ఉన్నాను
ఇహలోక బంధాలలో బందీనైనాను
మోక్షాన్ని నే కోరి వచ్చాను స్వామి
ఇహలోక బంధాలలో బందీనైనాను
మోక్షాన్ని నే కోరి వచ్చాను స్వామి
మనసున్న మా! మంచి మణికంఠ స్వామి
మన్నించు స్వామి
మన్నించు స్వామి
స్వామియే శరణமయ్యప్పా
స్వామియే శరణமయ్యప్పా ॥2॥
స్వామియే శరణமయ్యప్పా ॥2॥
🙏 స్వామియే శరణం అయ్యప్ప 🙏
🙏 స్వామియే శరణం అయ్యప్ప 🙏
🙏 స్వామియే శరణం అయ్యప్ప 🙏