అయ్యా బయలెల్లినాడో….. Ayya Bayalellinaado - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

🕉️ అయ్యా బయలెల్లినాడో 🕉️

─── అయ్యప్ప యాత్రా గీతం ───
॥ పల్లవి ॥
అయ్యా బయలెల్లినాడో
అయ్యప్ప స్వామి బయలెల్లినాడో
మణికంఠ స్వామి బయలెల్లినాడో
॥ చరణం ౧ ॥
ఆ తల్లి బాధ తీర్చుతాకు
స్వామి బయలెల్లినాడు
పులి పాల కోసమై
అయ్యా బయలెల్లినాడు
ఇరుముడిని ఎత్తుకొని
స్వామి బయలెల్లినాడు
ఇల్లంబు సేతబట్టి
అయ్యా బయలెల్లినాడు
అడవికేసే బయలెల్లె
అయ్యా బయలెల్లినాడో
అయ్యప్ప స్వామి బయలెల్లినాడో
॥ చరణం ౨ ॥
ఎరుమేలి దాటుకొని
స్వామి బయలెల్లినాడు
వావరుని తొడుగ
అయ్యా బయలెల్లినాడు
అలుదనది తీరనికీ
స్వామి బయలెల్లినాడు
మహిషిణి వధియించగా
అయ్యా బయలెల్లినాడు
అడవికేసే బయలెల్లె
అయ్యా బయలెల్లినాడో
అయ్యప్ప స్వామి బయలెల్లినాడో
॥ చరణం ౩ ॥
కరిమల కొండ దాతి
స్వామి బయలెల్లినాడు
పంబలోన స్నానమాది
అయ్యా బయలెల్లినాడు
నీలిమల కొండ దాతి
స్వామి బయలెల్లినాడు
పజ్జెంమిడి మెట్ల పైకి
అయ్యా బయలెల్లినాడు
కోవెలలో కొలువుండగా
అయ్యా బయలెల్లినాడో
అయ్యప్ప స్వామి బయలెల్లినాడో
🕉️ స్వామియే అయ్యప్పో 🕉️
స్వామి శరణం అయ్యప్ప శరణం
ఒంగురునాధ అయ్యప్ప
సద్గురునాధ అయ్యప్ప
స్వామియే శరణమయ్యప్ప

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow