🕉️ మల్లెపూల పల్లకీ బంగారు పల్లకీ 🕉️
─── అయ్యప్ప పల్లకి ఊరేగింపు గీతం ───
॥ పల్లవి ॥
హే.. మల్లెపూల పల్లకీ బంగారు పల్లకీమణికంఠుడెక్కినాడు అందాల పల్లకి (2)
॥ చరణం ౧ ॥
విల్లాలి వీరుడు యెక్కినాడు పల్లకివీర మణికంఠుడు యెక్కినాడు పల్లకి
హా... పందళ బాలుడు పంబ వాసుడు
హరిహర తనయుడు యెక్కినాడు పల్లకి గణపతి సోదరుడు యెక్కినాడు పల్లకి
షణ్ముఖ సోదరుడు యెక్కినాడు పల్లకి (2)
॥ మల్లెపూల పల్లకీ బంగారు పల్లకీ ॥
॥ చరణం ౨ ॥
హా... ఎరుమేలి వాసుడు ఏకాంత వాసుడుహరిహర తనయుడు యెక్కినాడు పల్లకి మహిషి మర్ధనుడు యెక్కినాడు పల్లకి
మదగజ వాహనుడు యెక్కినాడు పల్లకి (2)
॥ మల్లెపూల పల్లకీ బంగారు పల్లకీ ॥
॥ చరణం ౩ ॥
హా... కరిమల వాసుడు నీలిమల వాసుడుహరిహర తనయుడు యెక్కినాడు పల్లకి కాంతమల వాసుడు యెక్కినాడు పల్లకి
జ్యోతి స్వరూపుడు యెక్కినాడు పల్లకి (2)
॥ మల్లెపూల పల్లకీ బంగారు పల్లకీ ॥
॥ చరణం ౪ - ముగింపు ॥
హా.. భక్తుల బ్రోచే బంగారు స్వామిహరిహర తనయుడు యెక్కినాడు పల్లకి మల్లెపూల పల్లకీ బంగారు పల్లకీ
మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి
మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి
🕉️ ఓం స్వామియే శరణమయ్యప్ప 🕉️