88. వెన్నెలమ్మ వెన్నెల శబరి కొండల్ల వెన్నెల / Vennelamma Vennela - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

🌕 వెన్నెలమ్మ వెన్నెల 🌕
🙏 అయ్యప్ప భజన 🙏
వెన్నెలమ్మ వెన్నెల శబరి కొండల్ల వెన్నెల
నా చిన్ని అయ్యప్ప వెలసిన కొండల నిత్య పున్నమి వెన్నెల
॥ వెన్నెల ॥
ఓరోరి వెన్నెల ఓ ! చిన్ని వెన్నెల బంగారు వెన్నెల
రతనాల వెన్నెల ఒక్కమాట నీవు స్వామితో చెప్పవే
ఒక్కసారి వచ్చిపొమ్మని చెప్పవే ॥2॥
॥ వెన్నెల ॥
చూడవమ్మ చూడవే చేసేటి ఈ పూజలు
పొద్దు పొద్దున లేచి కన్నె స్వాములు చేసే స్వామి మండల పూజలు మా !
కన్నె స్వాముల పూజలు
॥ వెన్నెల ॥
చేసేటి పూజలు స్వామి కోసమే
మొక్కేటి మొక్కులు స్వామి కోసమే
పాడేటి పాటలు స్వామి కోసమే
నేను బతుకుతున్నది స్వామికోసం
నేను బతుకుతున్నది స్వామికోసం
॥ వెన్నెల ॥
చెప్పవమ్మ చెప్పవే చిన్నారి మా ! అయ్యతో
కలికాలమందున కన్నబిడ్డలు పడే కష్టాలు మా ! అయ్యతో
స్వామి మముగన్న మా ! అయ్యతో
॥ వెన్నెల ॥
🪔 భజన పుస్తకాలు 🪔
తల్లిదండ్రుల పైన ప్రేమలే లేదమ్మా
అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలమ్మ
అన్నీ ఉన్నవాడికి ఆకలే లేదమ్మ
ఆకలున్నవాడికన్నమే లేదమ్మ ॥2॥
॥ వెన్నెల ॥
వెళ్ళవమ్మ వెళ్ళవే వెళ్ళి స్వామితో చెప్పవే
బంగారు మా ! అయ్య మణికంఠస్వామిని వచ్చిపొమ్మని చెప్పవే
ఒక్కసారి రమ్మని చెప్పవే
॥ వెన్నెల ॥
కర్పూరమల్లె నే ! కరిగిపోతున్నా
కన్న బిడ్డలపైన కక్ష ఎందుకమ్మ
కనికరించి కరుణచూపమనవమ్మా
ఒక్కసారి వచ్చిపొమ్మనవమ్మా ॥2॥
॥ వెన్నెల ॥
ఓరోరి వెన్నెల ఓ ! చిన్ని వెన్నెల బంగారు వెన్నెల
రతనాల వెన్నెల ఒక్కమాట నీవు స్వామితో చెప్పవే
ఒక్కసారి వచ్చిపొమ్మని చెప్పవే ॥2॥
॥ వెన్నెల ॥
🙏 స్వామియే శరణం అయ్యప్ప 🙏

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow