బంగారు బతుకమ్మ ఉయ్యాలో – జడ్చర్ల బతుకమ్మ పాట
ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
జడ్చర్ల బతుకమ్మ ఉయ్యాలో
జడ్చర్ల బతుకమ్మ ఉయ్యాలో
బతుకునివ్వమ్మా ఉయ్యాలో
ఊరికి దక్షిణాన ఉయ్యాలో
పెద్ద గుట్టుంది ఉయ్యాలో
పెద్దగుట్ట ఉంది ఉయ్యాలో
గుట్ట మీద ఉన్నాడు ఉయ్యాలో
రంగనాయకుడున్నాడు ఉయ్యాలో
రంగనాయకుడున్నాడు ఉయ్యాలో
విష్ణువు ఉన్నాడు ఉయ్యాలో
శ్రావణమాసంలో ఉయ్యాలో
జాతర సాగుతాయి ఉయ్యాలో
ముప్పయి రోజులు ఉయ్యాలో
శ్రావణమాస ఉత్సవాలు ఉయ్యాలో
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బతుకు నీవమ్మా ఉయ్యాలో
వెయ్యేళ్ళ చరిత్ర ఉయ్యాలో
పెద్ద కోనేరు ఉంది ఉయ్యాలో
రంగనాయకులు పేరుమీద ఉయ్యాలో
రంగనాథ రామాయణం వచ్చింది ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
జడ్చర్ల బతుకమ్మ ఉయ్యాలో
బతుకునివ్వమ్మా ఉయ్యాలో
ఊరికి తూర్పున ఉయ్యాలో
చారిత్రక గుడులు ఉయ్యాలో
మామూలు గుడులు కావు ఉయ్యాలో
పేరున్న గుడులు ఉయ్యాలో
అలనాటి మాయాపురం ఉయ్యాలో
ఈనాటి గంగాపురం ఉయ్యాలో
రాజులేలిండ్రు ఉయ్యాలో
బౌద్ధులేలిన్రు ఉయ్యాలో
ఊరికి పక్కన ఉయ్యాలో
గొల్లత్త గుడి ఉంది ఉయ్యాలో
దుందుభి నది ఉయ్యాలో
కృష్ణా నదికి ఉపనది ఉయ్యాలో
నది ఒడ్డున ఉన్నాడు ఉయ్యాలో
పరుషవేదీశ్వరుడున్నాడు ఉయ్యాలో
మీనం అంటే ఉయ్యాలో చేప ఉయ్యాలో
అంబరం అంటే ఆకాశం ఉయ్యాలో
అందుకే ఈ క్షేత్రానికి ఉయ్యాలో
మీనాంబరం అని పేరు ఉయ్యాలో
పరశురాముడు ఉయ్యాలో స్థాపించిండు ఉయ్యాలో
సోమసూత్రముంది ఉయ్యాలో
శోకాలు తీరుతాయి ఉయ్యాలో
ఊరికి పడమట ఉయ్యాలో
ఫతేపురం ఉంటాది ఉయ్యాలో
పత్తేపురం అంటే ఉయ్యాలో
మైసమ్మ దేవత ఉయ్యాలో
పండగ సాయన్న కుయ్యాలో
అమ్మ అంటే ఇష్టం ఉయ్యాలో
ఆదివారంనాడు ఉయ్యాలో
పెద్ద జాతర అయితది ఉయ్యాలో
ఉమ్మడి జిల్లాలో ఉయ్యాలో
అమ్మ భక్తులెక్కువ ఉయ్యాలో
కోరికలు తీరుస్తది అమ్మా ఉయ్యాలో
కరుణిస్తది తల్లి ఉయ్యాలో
అమ్మకు నైవేద్యము ఉయ్యాలో
బంగారు బోనాలు ఉయ్యాలో
బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ ఉయ్యాలో
పాలమూరు జిల్లాలో ఉయ్యాలో
కృష్ణమ్మ ఉంటాది ఉయ్యాలో
తాగునీరు లేదు ఉయ్యాలో
సాగునీరు లేదు ఉయ్యాలో
అందుకే కోసం ఉయ్యాలో
లిఫ్ట్ ఇరిగేషన్ కడుతుండ్రు ఉయ్యాలో
ఎత్తిపోతల ఉయ్యాలో
నీళ్లు తెస్తారు అంట ఉయ్యాలో
సొరంగాలు తొవ్విండ్రు ఉయ్యాలో
రిజర్వాయర్లు కట్టిండ్రు ఉయ్యాలో
పంప్ హౌస్ కడుతుండ్రు ఉయ్యాలో
సాగునీరు ఇస్తారంట ఉయ్యాలో
తాగునీరు ఇస్తారంట ఉయ్యాలో