ఆ పరమేశ్వరుని ఆలయంలో పూజలు చేస్తే- శని, రాహు, కేతు దోషాలు మటుమాయం!

Navagraha Temple Guwahati - Unique Shiva Lingas

అసోంలోని గువాహటి నవగ్రహ ఆలయం – శివలింగాల రూపంలో నవగ్రహాలు

Navagraha Temple Guwahati Representation

చిత్రాచల్ శిఖరాలపై వెలసిన ప్రసిద్ధ నవగ్రహ ఆలయం

ముఖ్య గమనిక: అసోంలోని గువాహటిలో నవగ్రహ ఆలయంలో సాధారణ గ్రహ విగ్రహాలకు బదులుగా తొమ్మిది శివలింగాలు ఉన్నాయి. మధ్యలోని శివలింగం సూర్యునికి ప్రతీక కాగా, మిగిలిన ఎనిమిది లింగాలు ఇతర గ్రహాలకు ప్రతీకలు.

🕉️ ఆలయ విశిష్టత

సాధారణంగా నవగ్రహ ఆలయాల్లో నవగ్రహాల విగ్రహాలు ఉంటాయి. కానీ ఈ నవగ్రహ ఆలయంలో మాత్రం నవగ్రహాలు విగ్రహాల రూపంలో కాకుండా, తొమ్మిది వేర్వేరు శివలింగాల రూపంలో కొలువై ఉండటం విశేషం. చిత్రాచల్ శిఖరాలపై నవగ్రహాల రూపంలో పరమేశ్వరుడు కొలువై ఉన్నాడు.

📜 ఆలయ చరిత్ర

పరమ శివుడు నవగ్రహాల రూపంలో కొలువై ఉన్న ఈ ఆలయం అస్సాంలోని అత్యంత పురాతన దేవాలయాలలో ఒకటిగా విరాజిల్లుతోంది.

  • 16వ శతాబ్దం: కోచ్ రాజులు మొదటిసారిగా ఈ ఆలయాన్ని నిర్మించినట్లు స్థల పురాణం చెబుతోంది.
  • 1697: సంభవించిన అతిపెద్ద భూకంపంలో ఈ ఆలయం తీవ్రంగా దెబ్బతింది.
  • 1752: అహోం రాజు రాజేశ్వర సింహ ఈ ఆలయాన్ని పునర్నిర్మించి, శివలింగాల రూపంలో నవగ్రహాలను ప్రతిష్టించాడు.

🙏 గ్రహ దోషాలు పోగొట్టే గ్రహ లింగాలు

ఈ ఆలయంలో శివలింగాల రూపంలో వెలసిన నవగ్రహాలను "గ్రహ లింగాలు" అని అంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ తొమ్మిది లింగాలు తొమ్మిది ఖగోళ గ్రహాలకు సంకేతమని భక్తులు భావిస్తారు. ఆ గ్రహాలకు సంకేతంగా తొమ్మిది శివలింగాలకు తొమ్మిది రంగు వస్త్రాలను ఆలయ అర్చకులు అలంకరించడం విశేషం.

నవగ్రహాల అమరిక:

శివలింగాల రూపంలో కొలువై ఉన్న నవగ్రహాలలో మధ్యలో ఉన్న ప్రధాన లింగం గ్రహాధిపతి సూర్య భగవానుని సూచిస్తుంది. సూర్యునికి వృత్తాకార వలయంలో ఇతర నవగ్రహాలు కొలువై ఉంటారు.

💧 శిల్పుఖురి (Silpukhuri)

ఈ నవగ్రహ ఆలయానికి అనుసంధానంగా, దాని దక్షిణపు లోయలో ఒక నవకుణ్య చెరువును తవ్వారు. ఈ చెరువును శిల్పుఖురి అని పిలుస్తారు. నవగ్రహ లింగాల దర్శనానికి వచ్చిన భక్తులు ఈ చెరువులో స్నానం చేసి నవగ్రహ లింగాలను దర్శనం చేసుకోవడం ఆనవాయితీ!

🗓️ ఆలయ పూజావిధానాలు

ఆలయంలో ప్రతిరోజు నవగ్రహాలకు నిత్య పూజలు జరుగుతాయి. ఆయా వారాలను అనుసరించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగుతాయి:

  • ఆదివారం: సూర్యునికి
  • సోమవారం: చంద్రునికి
  • మంగళవారం: కుజునికి (అంగారకుడు)
  • బుధవారం: బుధునికి
  • గురువారం: బహస్పతికి
  • శుక్రవారం: శుక్రునికి
  • శనివారం: శని భగవానునికి

✨ పర్వదినాలు మరియు గ్రహ దోష పరిహారం

ప్రతి సంవత్సరం మాఘ, ఫాల్గుణ మాసాల్లో, సంక్రాంతి పర్వదినాలలో మూడు రోజుల పాటు మహా యజ్ఞం నిర్వహిస్తారు. జాతకంలో నవగ్రహ దోషాలు, శని దోషాలు, రాహు కేతు, కాలసర్ప దోష సమస్యలు ఉన్నవారు ఇక్కడ జరిగే విశేష పూజలు, గ్రహ దోష నివారణ పూజలు జరిపించుకోవడం వలన ఉపశమనం పొందుతారని విశ్వాసం.

🚌 ఎలా చేరుకోవాలి?

దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి అసోంలోని గువాహటికి రైలు, విమాన సకర్యాలున్నాయి. గువాహటి నగరంలోని సిల్‌పుఖురి ప్రాంతంలో ఉన్న చిత్రాచల్ కొండపైకి ఆటోలు, ్యాక్సీల ద్వారా సులభంగా చేరుకోవచ్చు.

ం నమః శివాయ!
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow