రుషి పంచమి విశిష్టత- మహిళలు కచ్చితంగా ఆచరించాల్సిన వ్రతం విధానం ఇదే!

Rishi Panchami Vratam - Significance and Rituals

భాద్రపద శుక్ల పంచమి రోజున జరుపుకునే ఋషి పంచమి వ్రతం – మహిళల పవిత్ర నోము

Rishi Panchami Representation

సప్తర్షులను స్మరించుకుని పూజించే విశిష్ట పర్వదినం ఋషి పంచమి

ముఖ్య గమనిక: భారతీయ సనాతన ధర్మానికి, ఆధ్యాత్మికతకు మూల స్థంబాలు అయిన సప్తర్షులను స్మరించుకునే విశిష్ట పర్వదినం రుషి పంచమి. మహిళలు దోష నివారణ కోసం తప్పకుండా చేయాల్సిన షి పంచమి పూజ!

ఋషి పంచమి ఎప్పుడు?

భాద్రపద మాసంలో వినాయక చవితి మరుసటి రోజైన భాద్రపద శుద్ధ పంచమి రోజును 'రుషి పంచమి'గా జరుపుకుంటాం. ఈ ఏడాది (2026) సెప్టెంబర్ 15, మంగళవారం రోజు ఈ వ్రతాన్ని జరుపుకోనున్నారు.

✨ షి పంచమి విశిష్టత

  • మహిళలు తమ నెలసరి సమయంలో జరిగిన పొరపాట్లకు ప్రాయశ్చిత్తంగా రుషి పంచమి వ్రతాన్ని చేసుకుంటారు.
  • ఋషి పంచమి రోజున మహిళలు గంగానదిలో స్నానం చేస్తే, కోటి అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం లభిస్తుందని శాస్త్రవచనం.
  • ఈ రోజున సప్తర్షులను స్మరించుకోవడం వల్ల తెలిసో తెలియకో చేసిన ఆచారపరమైన దోషాలు తొలగుతాయి.

సప్తర్షుల స్మరణ

రుషి పంచమి రోజు కింది సప్తర్షులను తప్పకుండా స్మరించుకోవాలి:

  1. అత్రి
  2. కశ్యప
  3. భారద్వాజ
  4. గౌతమ
  5. వశిష్ఠ
  6. విశ్వామిత్ర
  7. జమదగ్ని

ఈ సప్తర్షులకు రామాయణానికి అవినాభావ సంబంధం ఉంది. అందుకే ఋషి పంచమి రోజు శ్రీరాముని పూజించడం, రామాయణ పారాయణ చేయడం తప్పకుండా చేయాలి.

🕉️ ఋషి పంచమి పూజా విధానం

  1. వేకువ ఝామునే నిద్ర లేచి స్నానాదికాలు పూర్తి చేసుకుని పూజామందిరాన్ని శుభ్రం చేసుకోవాలి.
  2. శ్రీరామ పరివార చిత్రపటాన్ని గంధం కుంకుమలతో అలంకరించుకోవాలి.
  3. దీపారాధన, ఆచమనం, గణపతి పూజ, కలశపూజ చేయాలి.
  4. మల్లెలు, జాజులు, మందారాలు వంటి పూలతో శ్రీరామ అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి.
  5. వడపప్పు, పానకం, చిత్రాన్నం, అరటిపండ్లు, కొబ్బరి కాయలు శ్రీరాముల వారికి నివేదించాలి.
  6. మంగళ హారతులు ఇచ్చి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేసుకోవాలి.
  7. షి పంచమి వ్రత కథను చదువుకుని అక్షింతలు వేసుకోవాలి.

గమనిక: ఈ వ్రతం ఏడు సంవత్సరాలు చేసిన తర్వాత ఉద్యాపన చేయాలి.

🎁 ఉద్యాపనం ఇలా చేయాలి

  • ఉద్యాపనం చేసే రోజు ఒక సద్బ్రాహ్మణుడిని గురువుగా ఎంచుకొని ఇంటికి ఆహ్వానించి సకల విధివిధానాలతో పూజించాలి.
  • షడ్రసోపేతమైన భోజనం పెట్టాలి.
  • వెండి లేదా రాగి కలశం చెంబుకు ఒక నూతన వస్త్రాన్ని కట్టి పంచరత్నములు, పూలు, పండ్లు, గంధం, అక్షతలతో ఆ కలశమును పూజించాలి.
  • తమ శక్తి కొలది వెండితో లేదా రాగితో సప్తర్షుల విగ్రహాలను తయారు చేయించి ఆ కలశముల మీద ఉంచి, ఫల పుష్పములతో సమస్త పూజా ద్రవ్యములతో మధ్యాహ్న సమయమున శ్రద్ధతో భక్తితో సప్త ఋషులను పూజించి బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి.

📖 షి పంచమి వ్రత కథ (సారాంశం)

ఒకసారి ర్మరాజు శ్రీకషునితో "స్త్రీలు ఏ వ్రతం చేసినట్లయితే తెలిసి తెలియక చేసిన దోషాలు పోతాయి?" అని అడుగగా, కృష్ణ పరమాత్మ ఋషి పంచమి వ్రతం గురించి వివరించాడు.

పూర్వం విదర్భ దేశంలో ఉదంకుడు అనే బ్రాహ్మణుని కుమార్తె శరీరమంతా పురుగులు పట్టి బాధపడుతూ ఉండేది. ఉదంకుడు తన దివ్యదృష్టితో ఆమె పూర్వ జన్మ వృత్తాంతం తెలుసుకున్నాడు. ఆమె పూర్వ జన్మలో బ్రాహ్మణ స్త్రీగా ఉండి, రజస్వల అయిన సమయంలో ఇంటి పనులు చేసి, వంట పాత్రలు తాకి పాపం చేసిందని, అలాగే షి పంచమి వ్రతాన్ని దూషించిందని తెలిసింది.

ఆ దోష ఫలితంగానే ఈ జన్మలో ఆమె శరీరమంతా పురుగులు వ్యాపించాయి. ఉదంకుడు ఆమెతో "ఇప్పుడు ఈమె మరల ఋషి పంచమి వ్రతాన్ని శాస్త్రోక్తంగా చేస్తే ఆ దోషం పరిహారం అవుతుంది" అని చెప్పాడు. ఆ వ్రతం చేయడం వల్ల ఆమె దోషాలు తొలగిపోయాయి.

🌟 ఋషి పంచమి వ్రత ఫలం

ఏ స్త్రీ ఈ వ్రతమును శాస్త్రోక్తంగా ఆచరిస్తుందో ఆమె సమస్త పాపముల నుంచి విముక్తి పొంది ఇహ లోకమున పుత్ర పౌత్రాదులతో సుఖంగా ఉండి చివరకు మోక్షం పొందును.

శుభం భూయాత్!
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow