యమునా తరాన నీ వేణు గానం
శ్రీ రాధా మాధవ దివ్య ప్రణయ గీతం
🌊 యమునా తట ప్రణయ సంగీతం 🌊యమునా తరాన నీ వేణు గానం
యదరగిలించే ఎనలేని మధురము
నీ ప్రియవదనం వికసిత జలజం
నీ మృధు వీక్షణం జాబిలి కిరణం
నీ దరహాసం ఆమని జననం
నీ శుభ చరణం ఈ రాధశరణం
యమునా తరాన నీ వేణు గానం
యదరగిలించే ఎనలేని మధురము
నీ చేరువలో యుగమే క్షణము
నీ దూరములో క్షణమే యుగము
ఆరాధనలో ఆలాపనలో
నిరతము నీవే ఈ రాధ శరణం
యమునా తరాన నీ వేణు గానం
యదరగిలించే ఎనలేని మధురము
శృతి నీవైతే రాగము నేను
శశి నీవైతే తారను నేను
నిలిచెను నాలో నీ అవతారము
నిరతము నీవే ఈ రాధ జీవము
యమునా తరాన నీ వేణు గానం
యదరగిలించే ఎనలేని మధురము
🪈 యమునా తరాన నీ వేణు గానం 🪈
యదరగిలించే ఎనలేని మధురము