*ఈ పాదమే కదా ఇలయెల్ల కొలిచినది*

 ఈ పాదమే కదా ఇలయెల్ల కొలిచినది

ఈ పాదమే కదా ఇందిరా హస్తముల కితవైనది 

॥ఈ పాదమే॥


ఈ పాదమే కదా ఇందరును మొక్కెడిది

యీ పాదమే కదా ఇగ గనగంగ పుట్టినది

యీ పాదమే కదా యెలమి పెంపొందినది

యీ పాదమే కదా ఇన్నిటికినీ ఎక్కుడైనది 

॥ఈ పాదమే॥


ఈ పాదమే కదా ఇభరాజు దలచినది

యీ పాదమే కదా ఇంద్రాదులెల్ల వెదకినది

యీ పాదమే కదా యీ బ్రహ్మ కడిగినది

యీ పాదమే కదా ఎగసి బ్రహ్మండ మంటినది 

॥ఈ పాదమే॥


ఈ పాదమే కదా ఇహపరము లొసగెడిది

యీ పాదమే కదా ఇల నహల్యకు కోరికైనది

యీ పాదమే కదా యీక్షింప దుర్లభము

యీ పాదమే కదా ఈ వేంకటాద్రిపై నిరవైనది 

॥ఈ పాదమే॥


*ఓం నమో వెంకటేశ్వర నమో నమః* 

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow