కొండగట్టులోన ముత్యాలు రాలంగ - హనుమాన్ భజన పాటల లిరిక్స్

కొండగట్టులోన ముత్యాలు రాలంగ||

ముద్దుల అంజన్న కొలువుదీరిండమ్మ

పువ్వులారా అంజన్న పూజాకొస్తారా

పునాయముంటది మీకు ప్రతిరోజూ పుస్తరా||


ఆకొండకొనల్ల అందాల అడవుల్ల

ఎత్తైన కొండల్లా వెన్నెల వెలుగుళ్ళ ||-కో

గలగల పాటేటి జలక్బుగ్గ ఏరుల్లా

కోయిలపాటళ్ల కోతుల ఆటళ్ల||-కో

అందమైన పూజలందుకుంటుండట||-కో

కొలిచిన కొండంత వరములిపిండట

|| పువ్వులారా||

పచ్చని చెట్లన్నీ పూలచిత్రిలై

ఆకాశమేవంగి హారతులివ్వంగా||-కో

బలుగురుద్దమ్మాయి భక్తితో కొలవంగా

కొండగట్టుమీద నిండుగా కొలువుండే||-కో

పదకొండో రుద్రుడు పవనసుతుడట||-కో

పరమేషునోలే వెలుగుతున్నాడట

||పువ్వులారా||

వజ్రశరీరుడు వానరరూపుడు

శ్రీరామ భక్తుడు శ్రీఆంజనేయుడు||-కో

పైనిండా రోమాలు శ్రీరామనామాలు

చేతుల్లో చీడతాలు శ్రీరామ గానాలు||-కో

భక్తులనుగాచే శ్రీరామ భక్తుడు||-కో

కొండగట్టుమీద కొలువుదిరిండు

||పువ్వులారా||

సూర్యునికన్న తేజవంతుడట

సుడిగాలికన్న వేగవంతుడట||-కో

గదసేత వట్టిండు కొండలెత్తిండు

గంతులేసిండు భూమండలం వణుకు||-కో

తోక విసిరిండంటే లోకలే వణుకును||-కో

చిడతలు కొట్టిండో శ్రీరాముడే దిగును.

||పువ్వులారా||

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow