కైలాసరాణీ కారుణ్యపాణీ - అమ్మవారి భజన పాటల లిరిక్స్

 కైలాసరాణీ కారుణ్యపాణీ

మమ్ముపాలించు కళ్యాణి
ఇల కోలువైన ఓ నీలవేణీ

జగదేక మాతా జయమీయవమ్మా
చిరునవ్వు లొలుకుచు సిరులీయవమ్మా
అణువు అణువున వేల రూపముల
వెలసిన ఓ దేవదేవి
శరణంటినమ్మా శార్వాణీ

నిజరూపధారిణి నిత్యాలంకారిణి
కరుణించవా భక్త పోషిణి
రక్షింప శిక్షింప నీవేనులే
నీ కరుణా కటాక్షములే కోరేములే

పూజింతుమమ్మా కరుణించవమ్మా
ద్యానింతుమమ్మా దీవించమ్మా
సుధలు చిలకించు నీ చిరునవ్వులు
జగమంత కురిపించు విరిజల్లు

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow