🌼సుందర రూప సుబ్రహ్మణ్య🌼


 సుందర రూప సుబ్రహ్మణ్య

పరుగున రారా భక్తవరేణ్య

ఎగురలేదా నెమలివాహనం

అందలేదా నా ఆహ్వానం

lసుందరl


ఆరు ముఖములతో అభయమూర్తివై

ఎదలో నిలువగ రమ్మని పిలువగ

ఆరు ముఖములతో అరిషడ్వర్గము

వచ్చి స్థిరపడినది నా హృదయమున

అజ్ఞానములో మునుగుక మునుపే

ఆదుకోరా అనుపమ ధీరా

lసుందరl


మాయాతీత మహిమోపేత

ఆవహించని కోరగ నిన్ను

మాయా భూతము ఆవహించినది

వీడని రీతిగ స్వామీ నన్ను

చంచలమతినై చెడిపోక మునుపే

చేయూతనీర చేరుకోర

lసుందరl


*ఓం కార్తికేయ నమః*


#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow