శివ భజన పాటల లిరిక్స్ఏ@మి శంకరా నీదు మహిమ ఏమి శంకరా |

ఏమి శంకరా - JCL News TV
JCL News TV
భక్తి మార్గం - ఆధ్యాత్మిక ప్రస్థానం
ఏమి శంకరా నీదు మహిమ ఏమి శంకరా
ఎవ్వరీకి తెలియదాయె ఏమి శంకరా
పాలు కలిపిన పంచామృతము ఎంగిలంటివీ - శంకరా
1
గంగజలము తెచ్చినీకు అభిషేకం చేతమంటే గంగలో నున్న కప్ప, చేపల ఎంగిలంటివీ శంకరా
॥ ఏమి ॥
2
ఆవు పాలు తెచ్చినీకు అభిషేకం చేతమంటే చిన్ని చిన్ని లేగదూడల ఎంగిలంటివీ శంకరా
॥ ఏమి ॥
3
పండ్లు ఫలములు తెచ్చినీకు నైవేద్యం చేతమంటే చిన్ని చిన్ని రామచిలుకల ఎంగిలంటివీ - శంకరా
॥ ఏమి ॥
4
తుమ్మి పూలు తెచ్చినీకు తృప్తిగా పూజింతమంటే కొమ్మకొమ్మకు కోటితుమ్మెదల ఎంగిలంటివీ - శంకరా
॥ ఏమి ॥
5
నారికేళము తెచ్చినీకు నైవేద్యం పెడదమంటే అప్పుడైనా నీవు నన్ను ఒప్పుకొందువా - శంకరా
॥ ఏమి ॥
🙏 ఓం నమః శివాయ

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow