@ ఘల్లు ఘల్లు ఘల్లున రావయ్య గణముల అధిపతి గణపయ్య@ వినాయక భజన పాటల లిరిక్స్

ఘల్లు ఘల్లు ఘల్లున రావయ్య

గానం : జంగిరెడ్డి గురుస్వామి

ఘల్లు ఘల్లు ఘల్లున రావయ్య  గణముల అధిపతి గణపయ్య
||కోరస్||

భల్లు భల్లు భల్లున లేవయ్య భజనల దళపతి బలమియ్య
||కోరస్||

శరణం శరణం గజానన శివబాల గజ ముఖ వదన
||కోరస్||

||ఘల్లు ఘల్లు ఘల్లున రావయ్య||

పిండి బొమ్మకే పురుడు పోసిన తల్లి పార్వతమ్మ
ప్రణప్రదంగా నిన్ను చూసిన గౌరి దేవతమ్మ
తల్లి మాటనే జవదాటని తనయుడవే నీవయ్య
తండ్రి తానే అని తెలియక శివుడిని అడ్డగిస్తివయ్య
గౌరీ సుతుడా గజానన గండరీ గండ గజవదనా

||ఘల్లు ఘల్లు ఘల్లున రావయ్య||

కోపమాగని శివుడు నీ శిరస్సు ఖండించేనయ్య
పార్వతి వేడగ నీ రూపము ఇక గజ ముఖ మాయెనయా
శివపార్వతుల ప్రేమ సన్నిధిలో పెరిగిన గణపయ్య
నిరతం వారి సేవలోనే తరించినావయ్య
లంబోదరుడా గజానన లకుమికూడా గజముఖ వదన
||కోరస్||

||ఘల్లు ఘల్లు ఘల్లున రావయ్య||

ముల్లోకాలు తిరగక మూషిక వాహనమొచ్చెనయ
ఎలుక నెక్కే ఈ ఏనుగు కథ భలే విచిత్రమేనయ
జ్ఞాన జ్యోతులను వెలిగించగ ఇల గుణ గుణ రావయ్య
విఘ్నాలను కలిగించక మమ్ము దీవించావయ్య
విఘ్న వినాయక గజానన - జ్ఞాన ప్రదాయక గజ వదన
||కోరస్||

||ఘల్లు ఘల్లు ఘల్లున రావయ్య||

శరణం శరణం గజానన
శివబాల గజ ముఖ వదన
శరణం శరణం గజానన
శివబాల గజ ముఖ వదన
||2||   ||కొరస్||

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow