తగునయ్య హరి నీకు దానము దెచ్చుకొనిన

 ॥పల్లవి॥

తగునయ్య హరి నీకు దానము దెచ్చుకొనిన

జగములో భూకాంత సౌభాగ్యలక్ష్మి ॥తగు॥


కిమ్ముల శిశుపాలుని గెలిచి చేకొంటివిగా

సమ్మతించి రుక్ష్మిణి జయలక్ష్మి అమ్ము మొనను 

జలది నడఁచి లంక సాదించి కమ్మరఁ జే

కొన్నసీతే ఘనవీరలక్ష్మి ॥తగు॥


నరకాసురు నడఁచి నవ్వుతాఁ జేయివేసితివి

సరిగా సత్యభామే పో సంగ్రామలక్ష్మి

హిరణ్యకశిపుఁ గొట్టి యింద్రాదులకు నీచే

వరమిప్పించినయాకే వరలక్ష్మి ॥తగు॥


నిండినవురముమీఁద నిఖిలసంపదలతో

అండనుండే యాకెపో ఆదిలక్ష్మి

మెండగుశ్రీ వేంకటాద్రిమీఁద నీసరుస నేఁగే

గండుమీరెఁ గళలతోఁ గల్యాణలక్ష్మి ॥తగు॥🙏🌷🙏

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow