అన్నమయ్య కీర్తన అదివో అల్లదివో / Annamayya Keerthana

 అదివో అల్లదివో శ్రీ హరి వాసము

పదివేల శేషుల పడగల మయము ‖

అదె వేంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము |
అదివో నిత్యనివాస మఖిల మునులకు
అదె చూడు డదె మొక్కు డానందమయము ‖

చెంగట నదివో శేషాచలమూ
నింగి నున్న దేవతల నిజవాసము |
ముంగిట నల్లదివో మూలనున్న ధనము
బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము ‖

కైవల్య పదము వేంకట నగ మదివో
శ్రీ వేంకటపతికి సిరులైనది |
భావింప సకల సంపద రూపమదివో
పావనముల కెల్ల పావన మయమూ ‖

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow