77 అంబ వందనం జగదంబ వందనం - అమ్మవారి భజన పాటల లిరిక్స్

 అంబ వందనం జగదంబ వందనం

కంబు కంఠు రాణి కళ్యాణి వందనం

వేదములను కన్నతల్లి వేలవేల వందనం
ఆదిలక్ష్మి మమ్ము బ్రోవు అపర్ణ వందనం

పారిజాతమును మించు పాదములకు వందనం
ఫాలలోచనుని రాణి పార్వతి వందనం

కుండలముల చేత మెరయు కర్ణములకు వందనం
అండజాయాన చాముండి వందనం

కంకణముల చేత మెరయు కరములకు వందనం
కాలకంఠు రాణి కామాక్షి వందనం

మణుల చేత మెరయు నీ మకుటమునకు వందనం
మలయాచల వాసిని మహేశి వందనం

భర్గురాణివనుచు నిన్ను ప్రణుతి సేతునమ్మ తల్లీ
వర్గాపవర్గదా దుర్గ వందనం
కనకదుర్గ వందనం

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow