@శబరిగిరి అయ్యప్పా శంకరుడే మీయప్పా@ shabarigiri Ayyappa shankarude -@ అయ్యప్ప స్వామి భజన పాటల లిరిక్స్

శబరిగిరి అయ్యప్పా

శబరిగిరి అయ్యప్పా శంకరుడే మీయప్పా
విశ్వమోహనీదేవి విష్ణువే నీ తల్లి

|| శబరి ||

స్వాములకే స్వామివైన స్వామి అయ్యప్పా
గురువులకే గురువైన గురువాయూరప్పా

|| శబరి ||

మధురాపురిమాధవునే మరిపిస్తావయ్యా
ఉడిపి శ్రీకృష్ణునిలా ఉన్నావు కదయ్యా

|| శబరి ||

కొండలలో నెలకొన్న పంపానది రాయా
కొండలకే కొండయైన శబరిగిరి వాసా

|| శబరి ||

భద్రాచల రామయ్య బంధువు నీకయ్యా
పళని మురుగన్నీకు వరుసకు అన్నయ్యా

|| శబరి ||

స్వామియే శరణమయ్యప్పా

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow