@Ayya niyamaala malato@అయ్యా నియమాల మాలతో@ అయ్యప్ప స్వామి భజన పాటల లిరిక్స్@

```html
🕉️ అయ్యా నియమాల మాలతో 🕉️
అయ్యా నియమాల మాలతో - నిన్ను కొలిచిన నిజము తెలిసేనయ్యా
మలినమైన నా మనసు నందు - యతి మధుర మొలికెనయ్యా
దివ్య జ్యోతి అను పేరులోన - ఇక చీకటి ఉండదయ్యా
రంగ నాధుడే వెలసిన గ్రామము - నిత్య వెలుగులయ్యా
శరణ ఘోషలే పాడుకొంటిని - క్షణము క్షణము నిన్ను మరువకుంటిని ||2||
గుండె నిండుగా నీదు రూపమే - నింపుకొంటినయ్యా
🙏 || అయ్యా నియమాల || 🙏
🌺 చరణం – 1 🌺
మా ఊరిలో వున్న మా భాగ్యలక్ష్మికి - బాధ చెప్పు కున్నా
పోచమ్మకు బోనము చేసి - మొక్కు మొక్కు కున్నా
అభయమిచ్చు ఆ ఆంజనేయునీతో నేను వేడుకున్న
మొక్కులన్నీ ఇరుముడిన కట్టి - నీ కొండ చేరుతున్నా
కరుణించి దారి చూపిస్తావో - కానల్లో మమ్ము నడిపిస్తావో ||2||
కరుణామయా కానన వాసా - కనికరించవయ్యా!
🙏 || అయ్యా నియమాల || 🙏
🌺 చరణం – 2 🌺
కటిక నేలపై తుంగచాపపై - నిద్రపోతినయ్యా
కనులు ముసిన కలల నిండా - నీ దివ్యరూపమయ్యా
పడిపూజల నీదురూపమే - మనసు నిండెనయ్యా
పంచగిరులను వదిలివచ్చి - మా పక్కనుండవయ్యా
కన్నెస్వామి రూపములోనో - కత్తిస్వామి రూపములోనో ||2||
గురుస్వామి రూపములోనో - మాముందు నిలుతువయ్యా
🙏 || అయ్యా నియమాల || 🙏
🌺 చరణం – 3 🌺
కాలినడకతో కొండకోనలో - నడిచి వచ్చు వేలా
ప్రతి చెట్టు పుట్టలో - నీదునామమే ప్రతిధ్వనించెనయ్యా
పసిపాప రూపమున - పడి మెట్లపై నిన్ను చూసేవేళ
నా తనువులోని అణువణువునందు - నీరూపు నిండేనయ్యా
ఏ జన్మలోన నీ రుణముందో - ఈ జన్మలోన అది తీరిందో ||2||
ప్రతి జన్మలోన నిను కొలిచే భాగ్యము - కనుకరించవయ్యా
🙏 || అయ్యా నియమాలు || 🙏
🕉️ స్వామియే శరణం అయ్యప్ప 🕉️
🙏 శరణం శరణం అయ్యప్ప 🙏
```

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow