@Shabari kondapai Velasina@ శబరి కొండపై వెలసిన అయ్యప్ప @అయ్యప్ప భజన పాటల లిరిక్స్

🙏 శబరి కొండపై వెలసిన అయ్యప్ప 🙏
శబరి కొండపై వెలసిన అయ్యప్ప
నీ పూజలు చేయక వచ్చితిమయ్యా
పాలు పండ్లు నైవేద్యాలు
పంచామృతాలు తెచ్చినాము స్వామి

॥ 2 కోరస్ ॥
మండల దీక్షలు పట్టిన మయ్యా
మాలలు మెడలో దాల్చిన అయ్యా
నల్లని దుస్తులు ధరించి
మేము నీ నామ జపమునే చేసిన మయ్యా
నేను మండల రోజులు నిష్ఠగా కొలిచి
పడిపూజలతో పరవశించినము
అనుదినము నిన్ను ఆత్మలో నిలిపి
నీ ధ్యానముతో గడిపిన మయ్యా
॥ శబరి కొండపై ॥
కామ క్రోధ మద మత్సరములను
కష్టం అనక వీడనాడిన మయ్యా
ఇరుముడి గట్టి శరణుకొంటూ
ఎరిమేలికే బయలు ఎల్లినాము స్వామి
॥ శబరి కొండపై ॥
ఘోరమైన అడవులలో
గురుస్వామితో కదిలిన మయ్యా
రాళ్ల బాటలో ముళ్ల తోటలో
కాలినడకతో వచ్చిన మయ్యా
పంబలో నిండుగా స్నానము చేసి
పాపాలే ఎడబాపినాము స్వామి
॥ శబరి కొండపై ॥
కన్నెమూల గణపయ్య స్వామికి
టెంకాయలనే కొట్టిన మయ్యా
శబరి నందు ఆ శరణు గుత్తిలో
బాణాలన్నీ గుచ్చిన మయ్యా
ఇరుముడి పూజలు నీకర్పించి
మకర జ్యోతిని దర్శించినామయ్యా
శబరి కొండపై వెలసిన అయ్యప్ప
నీ పూజలు చేయక వచ్చిన మయ్యా
పాలు పండ్లు నైవేద్యాలు
పంచామృతాలు తెచ్చినము స్వామి

॥ 2 కోరస్ ॥
స్వామియే శరణం అయ్యప్ప 🙏
స్వామియే శరణం అయ్యప్ప 🙏

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow