🙏 పల్లవి 🙏
రావా మణికంఠ స్వామి - మా ఇంటికి //2//
పూజ ఉన్నది - మంచి భజనున్నది //2//
ఆపైన మంచి విందున్నది
దూప దీపాలతోటి - హారతి ఇస్తున్నది //2//
పంచామృతాలతోటి స్నానమున్నది //2//
పూజ ఉన్నది - మంచి భజనున్నది //2//
ఆపైన మంచి విందున్నది
దూప దీపాలతోటి - హారతి ఇస్తున్నది //2//
పంచామృతాలతోటి స్నానమున్నది //2//
|| రావా మణికంఠ ||
చరణం 1
సన్నా సన్నాని బియ్యం - అన్నమున్నది
పుల్లా పుల్లని - పులిహోర ఉన్నది //2//
నీకెంతో ఇష్టమైన - పాయసంబున్నది
పుల్లా పుల్లని - పులిహోర ఉన్నది //2//
నీకెంతో ఇష్టమైన - పాయసంబున్నది
|| రావా మణికంఠ ||
చరణం 2
పాలకూర పప్పేసి - ఆలు వంకాయేసి
రవ్వలడ్డూలతోటి పంచామృతాలతోటి //2//
తేనెతోటి విందు ముందున్నది
రవ్వలడ్డూలతోటి పంచామృతాలతోటి //2//
తేనెతోటి విందు ముందున్నది
|| రావా మణికంఠ ||
చరణం 3
గరం గరం అప్పడాలు - ఘుమ ఘుమ సాంబారు
వేడి వేడి మిర్చీలతో - మెత్త మెత్త పూరీలతో //2//
గట్టి గట్టి పెరుగుతో విందున్నది
వేడి వేడి మిర్చీలతో - మెత్త మెత్త పూరీలతో //2//
గట్టి గట్టి పెరుగుతో విందున్నది
|| రావా మణికంఠ ||
చరణం 4
ధూపా దీపాలతోటి హారతి ఇస్తున్నది //2//
పంచామృతాలతోటి స్నానమున్నది //2//
పంచామృతాలతోటి స్నానమున్నది //2//
|| రావా మణికంఠ ||
🙏 స్వామియే శరణం అయ్యప్ప 🙏