🙏 పల్లవి 🙏
తల్లి గర్భములో - అణువుగా మము వేసి
తొమ్మిది మాసాలు - మమ్మే నువు కాచి
బయటకు తెచ్చిన భగవంతుడవే అయ్యాప్పా
మా బ్రతుకు నెట్టా రావయ్యా మణికంఠ..
తొమ్మిది మాసాలు - మమ్మే నువు కాచి
బయటకు తెచ్చిన భగవంతుడవే అయ్యాప్పా
మా బ్రతుకు నెట్టా రావయ్యా మణికంఠ..
!! తల్లి !!
చరణం 1
జగమే నాటక రంగం చేసి
జనులందరిని నటులను చేసి
సూత్రదారిగా నువ్వు ఉండి
పాత్రదారుల మమ్మే చేసి
నువ్వు ఆడించే నాటకమే ఈ జన్మ...
ఈ మున్నాళ్ల ముచ్చట అగుట మా కర్మా..
జనులందరిని నటులను చేసి
సూత్రదారిగా నువ్వు ఉండి
పాత్రదారుల మమ్మే చేసి
నువ్వు ఆడించే నాటకమే ఈ జన్మ...
ఈ మున్నాళ్ల ముచ్చట అగుట మా కర్మా..
!! తల్లి !!
చరణం 2
పంచ భూతాలనే పట్టి మట్టి బొమ్మలు చేసి
ప్రాణమే దానికి పోసి తలరాతంట్టు నువ్వే రాసి
సిరి నవ్వులతో సిరి సంపదలు ఇచ్చేవు
వాటిని దూరము చేసి దుఃఖాలే మిగిలించేవు
ప్రాణమే దానికి పోసి తలరాతంట్టు నువ్వే రాసి
సిరి నవ్వులతో సిరి సంపదలు ఇచ్చేవు
వాటిని దూరము చేసి దుఃఖాలే మిగిలించేవు
!! తల్లి !!
చరణం 3
తల్లిదండ్రులను ఇచ్చేవు, భార్యాబిడ్డలను ఇచ్చేవు
బంధుమిత్రులను ఇచ్చేవు, ఆత్మ బంధాలేసావు
సంసార మనే సాగరాన వేసేవు
దాని మీద మేము ఆవేదన పడితే చూసేవు
బంధుమిత్రులను ఇచ్చేవు, ఆత్మ బంధాలేసావు
సంసార మనే సాగరాన వేసేవు
దాని మీద మేము ఆవేదన పడితే చూసేవు
!! తల్లి !!
🙏 స్వామియే శరణం అయ్యప్ప 🙏