🙏 పల్లవి 🙏
ఆనందం పరమానందం అయ్యప్ప దర్శనం ఆనందం
శబరిగిరీశ్వర దివ్యకళేబర దర్శనభాగ్యం ఆనందం
శబరిగిరీశ్వర దివ్యకళేబర దర్శనభాగ్యం ఆనందం
చరణం 1
అద్భుత దర్శన మానందం – మంగళదర్శన మానందం
శబరిగిరీశ్వర దివ్యకళేబర – దర్శనభాగ్యం ఆనందం
శబరిగిరీశ్వర దివ్యకళేబర – దర్శనభాగ్యం ఆనందం
చరణం 2
కనక కిరీటం ఆనందం – తిలక లలాటం ఆనందం
కుండల మండల కంఠస్థలము – దర్శనభాగ్యం ఆనందం
కుండల మండల కంఠస్థలము – దర్శనభాగ్యం ఆనందం
చరణం 3
కరుణాక్షం ఆనందం – తిరునాసికము ఆనందం
మందస్మిత మనోహర వదనం – ఆనందం పరమానందం
మందస్మిత మనోహర వదనం – ఆనందం పరమానందం
చరణం 4
దివ్యాభరణం ఆనందం – మణీకంఠ నామం ఆనందం
శ్యామల కోమల వక్షోభాగం – ఆనందం పరమానందం
శ్యామల కోమల వక్షోభాగం – ఆనందం పరమానందం
చరణం 5
ముద్రాంకిత కర మానందం – భద్రాసనము ఆనందం
నీలాంబర పరమేష్టి కాంతయు – ఆనందం పరమానందం
నీలాంబర పరమేష్టి కాంతయు – ఆనందం పరమానందం
చరణం 6
ధృక్పాదాంబుజ మానందం – తిరునాభిపురం ఆనందం
అద్భుత విగ్రహ కరుణాసాగర – చిన్మయరూపం ఆనందం
అద్భుత విగ్రహ కరుణాసాగర – చిన్మయరూపం ఆనందం
చరణం 7
పాదాది కేశం ఆనందం – కేశాది పాదం ఆనందం
శబరిగిరీశ్వర దివ్యకళేబర దర్శనభాగ్యం ఆనందం || ఆనందం ||
శబరిగిరీశ్వర దివ్యకళేబర దర్శనభాగ్యం ఆనందం || ఆనందం ||
🙏 స్వామియే శరణం అయ్యప్ప 🙏