@ జయ జయ జయ వినాయక జయములీయవా స్వామి@ Jaya Jaya Jaya Vinayaka @వినాయక భజన పాటల లిరిక్స్

జయ జయ జయ వినాయక

జయ జయ జయ వినాయక జయములీయవా స్వామి
అభయమీయవా.. //2//
గణ గణ గణ గణనాయక గుణమునీయవా, సద్గుణమునీయవా.
గజానన శరణం.. గజముఖ వదనా శరణం //2//

శ్రీ పార్వతి తనయా శిరసాభి వందనం..
హరహర ప్రియ సుతుడా హృదయాభి వందనం.. //2//
ప్రథమ పూజ దురంధరుడ ప్రణమిల్లెదమయ్యా //2//
పరమ పావనము జేయ పరుగున రావయ్యా...

|| గజానన ||

వక్రతుండ మహాకాయ సుమశరమే నీ వరం
ఏకదంత రూపాయ సుమధురమే నీ ధ్యానం //2//
సిద్ధి బుద్ధి విఘ్నేశ్వర భజియించెదమయ్యా //2//
స్వరారాగం సుధలందగ శీఘ్రమే రావయ్యా..

|| గజానన ||

మహదేవా నీలోకం మాతాపితా సేవితం
మహాబలా నీ మార్గం అనుసరించు ఈ జగం //2//
కాణిపాక గణాధీశ స్మరియించెదమయ్యా.. //2//
కన్నె మూల గణపతి కదలి రావయ్యా..

|| గజానన ||

🙏 ఓం గం గణపతయే నమః 🙏

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow