విన్నారా అయ్యప్ప / Vinnara Ayyappa - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

```html

🕉️ విన్నారా అయ్యప్ప స్వామి జననం 🕉️

పల్లవి
విన్నారా అయ్యప్ప స్వామి జననం
జగతి కన్నరా శబరిగిరీ దివ్య చరితము (2)
శబరిగీరి వాసుని వైభవం.
🌺 చరణం – 1 🌺
సంతతి కనలేక పందళ భూపతి
సత్యం ధర్మం తప్పక పూజలు చేసేనే (2)
ఒకనాడు అడవికి వెడలేను వేటాడ
పొడలేమే పులకించేను పసికందునట చూడ
మనస్సే వికసించ నే మమతే విరభూచనే
మహినే మరిపించేనే
విన్నారా........ వైభవం
🌺 చరణం – 2 🌺
భూమాత మెత్తని వడి ఉయ్యాల కాగా
వనదేవత చిరుగాలి వింధ్యా మరలే కాగా
నాగ దేవత పడగ నీడలో హాయిగా
అందాలోలుక పవలించేను ఒక బాలుడు
విన్నారా........ వైభవం
🌺 చరణం – 3 🌺
తన్మయుడై రాజు ఆ బిడ్డను ఎత్తుకొని
తహ తహలాడు రాణి చేతుల్లో పెట్టగానే (2)
తనయుని ముద్దాడి మణికంఠుడను పేరా
తలచిరి దైవాను గ్రహము తను భాగ్యమని
మనస్సే వికసించేనే మమతే విరబూచేనే
🕉️ విన్నారా అయ్యప్ప స్వామి జననం 🕉️
```

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow