వీల్లాలి వీల్లాలి వీల్లాలి వీల్లాలే / Villali Villali - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

🕉️ వీల్లాలి వీల్లాలి వీల్లాలే 🕉️
వీల్లాలి వీల్లాలి వీల్లాలి వీల్లాలే
వీల్లాలి వీరనే వీరమణిగండనే
రాజాది రాజనే రాజకుమారనే
స్వామియే – అయ్యప్పో – శరణమో అయ్యప్పో
॥ వీల్లాలి ॥

ఎరుమేలి చేరినాము – పేటతుల్లి ఆడినాము
వావరుని చూసినాము – వందనాలే చేసినాము
మణికంఠునితో మేము పెద్దదారి నడిచినాము
పాదయాత్ర ఆరంభం – శరణఘోష ప్రారంభం

॥ వీల్లాలి ॥

అక్కడక్కడాగినాము – ఆళందాకు చేరినాము
ఆళుదాలో స్నామాడి – రెండు రాళ్ళు తీసినాము
కఠిన కఠినముకొంటు – కరిమల ఎక్కినాము
ఫరజ్యాసలేదమ – పరమాత్మ నీవయ్య

స్వామియే అయ్యప్పా – శరణమో అయ్యప్పో
॥ వీల్లాలి ॥

శరణఘోష చెప్పుచు – పంపాకు చేరినాము
పంపాలో స్నానమాడి – పాపాలను వదలినాము
శరంగుత్తి చేరినాము – శరణములు గుచ్చినాము
సన్నిధానం చేరినాము – పద్దెనిమిది మెట్లు ఎక్కినాము
అయ్యప్పను చూసినాము – ఆనందం పొందినాము
మరో జ్యాస లేదయ్యా – పరమాత్మ నీవయ్యా

స్వామియే అయ్యప్పో – శరణమొ అయ్యప్పో
॥ వీల్లాలి ॥
🎵 భజన ఆడియో CD 🎵
🙏 స్వామియే శరణం అయ్యప్ప 🙏

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow