శబరిమలై నౌక సాగిపోతున్నది / Shabarimalai Nowka sagipotunnadi - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

🙏 శబరి మలై నౌక - సాగి పోతున్నది 🙏
స్వామియే అయ్యప్పా - అయ్యప్పా స్వామియే
శబరిమలై నౌక సాగిపోతున్నది
అయ్యప్ప నౌక సాగిపోతున్నది
అందులో చుక్కాని - శ్రీమణికంఠుడు
॥ శబరి ॥
అమ్మలారా అయ్యలారా - రండి రండి మీరు
నామంబు పలికితే - నావ సాగిపోతుంది.
తెడ్డెయ్యనక్కరలేదు - తెరచాపక్కరలేదు
॥ శబరి ॥
నామంబు పలికితే - నావ సాగిపోతుంది
కదలకండి బాబు మెదలకండి బాబు
నామంబు పలికితే - నావ సాగిపోతుంది.
॥ శబరి ॥
డబ్బిచ్చి మీరు - ఈ నావ ఎక్కలేరు
భక్తితో మనము - ఈ పడవ ఎక్కగలము
నామంబు పలికితే - నావ సాగిపోతుంది.
॥ శబరీ ॥
కష్టా సుఖములు రెండు ఘనమైన కెరటాలు
నామంబు పలికితే - నావ సాగిపోతుంది.
॥ శబరి ॥
జ్ఞానమనే ధనము అందించు మనకు
నామంబు పలికితే - నావ సాగిపోతుంది
॥ శబరి ॥
మణికంఠ నౌక సాగిపోతున్నది.
కన్నెస్వామి నౌక సాగిపోతున్నది,
కత్తి స్వామి, గంట స్వామి, గద స్వామి, గురు స్వామి
నౌక సాగిపోతున్నది.
🙏 స్వామియే శరణం అయ్యప్ప 🙏

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow