పల్లికట్టు శబరిమలైకి / Pallikattu Shabarimalaiki - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

ఇరుముడితోటి నిను మదినింపి - కదిలేము స్వామి
అండగనుండి నీడగనిలిచి - దీక్షను కావవయ్యా
పల్లికట్టు శబరిమలైకి - కల్లుమ్ ముల్లుం కాలికి మెత్తెయి

స్వామియే అయ్యప్పో - అయ్యప్పో స్వామియే
పల్లికట్టు శబరిమలైకి - కల్లుమ్ ముల్లుం కాలికి మెత్తెయి
స్వామియే అయ్యప్పో - అయ్యప్పో స్వామియే

నెయ్యాభిషేకం చెయ్యండి - హారతులిచ్చి కొలవండి
ఇరుముడి స్వామికి భక్తిగ ఇచ్చి - వేదన తీరగ వేడండి
అయ్యప్పను కని పిలవండి
॥ స్వామియే అయ్యప్పో - అయ్యప్పో స్వామియే ॥
వేకువ జామున నిద్రనులేచి - శీతల స్నానము శ్రద్దగా చేసి
మాలను దాల్చి శీఘ్రముగా - దీక్షారంబము చేసితిని

గణపతి షణ్ముక అయ్యప్ప స్వాముల - ప్రాతఃకాలపు వేళల తలచి
స్వామి అయ్యప్ప శరణు ఘోషతో - మండల దీక్షచేసితిని
॥ స్వామియే అయ్యప్పో - అయ్యప్పో స్వామియే ॥
ముప్పూటలు శ్రీ అయ్యప్ప స్వామిని - ముదమున కొలిచి సేవించి
నల్లని దుస్తులు ధరించి - శ్రీ శని భగవానుని కొలిచెదము
కాలికి చెప్పులు లేకయే తిరుగుచు - అయ్యప్పలనే శృతియించితి
సంధ్యా సేవలు చేయుచు స్వామిని - ఆనందముగా కొలిచెదను
॥ స్వామియే అయ్యప్పో - అయ్యప్పో స్వామియే ॥
భజనలు చేసే స్వాములగృహములు - వెతికే వెళ్ళితిమి
పడి పూజలతో మణిధరుని - జ్యోతిగ చూచి మురిసితిని
స్వామి ప్రసాదము సేవించి - నేలను నిద్దుర పోయితిని
మండలమంతా ఇటులే - అయ్యప్పను నే కొలిచితిని
దేహబలందా - పాద బలందా
స్వామి ఇచ్చిన ధైర్యముతోటి - దీక్షను ముగియించి
గురు స్వామిని గని - భక్తితో కొలచి
ఇరుముడి దాల్చితిని - నే ఇరుముడి దాల్చితిని
॥ స్వామియే అయ్యప్పో - అయ్యప్పో స్వామియే ॥
సత్య వాక్కులను పలుకుచూనే - స్వామి నామము తలచితినీ
దృష్టింతలను మదిలో మాని - అయ్యప్పను యద దాల్చితిని
మానస మందున మురిసితిని

పదినెనిమిది మెట్లెక్క తలచితిని - అయ్యప్ప స్వామినే కాంచేదనూ
మకర జ్యోతిని చూసెదను - స్వామి సన్నిధిలో
నన్ను నే మరచెదను
పల్లికట్టు శబరిమలైకి
కల్లుమ్ ముల్లుమ్ కాలికిమెతై

🙏 స్వామియే అయ్యప్పో - అయ్యప్పో స్వామియే 🙏
🕉️ స్వామియే శరణం అయ్యప్ప 🕉️

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow