🪔 స్వామి అయ్యప్పా స్వామీ అయ్యప్పా 🪔
🙏 అయ్యప్ప భజన 🙏
స్వామి అయ్యప్పా స్వామీ అయ్యప్పా
నీవే గతిదేవా ననుబ్రోవగ ఇకరావా
అందకారమందే అలమటించి నేనూ
కన్నులుండి కూడా కాననైతి నిన్ను ॥2॥
నీవే గతిదేవా ననుబ్రోవగ ఇకరావా
అందకారమందే అలమటించి నేనూ
కన్నులుండి కూడా కాననైతి నిన్ను ॥2॥
దేవ దేవ నాపై కరుణ కురియవేల ॥2॥
వెలుగు వైపు నాకూ వేగమే చూపించుము తోవ
॥ స్వామి అయ్యప్పా ॥
సిరుల నెన్నడైనా అడుగుటెరుగనయ్యా
స్వర్గ సుఖముకోరీ వరము వేడనయ్యా ॥2॥
స్వర్గ సుఖముకోరీ వరము వేడనయ్యా ॥2॥
ముక్తి పొంద నెంచి చేయి చాచానయ్యా ॥2॥
శాంతి కోరి నిన్నే నేను పాడుచుందునయ్యా
॥ స్వామి అయ్యప్పా ॥
కనులలోను నీవే వెలుగు నింపుమయ్యా
మనసులోన నీవే కొలువు దీరవయ్యా
మధుర సుస్వరాల సుధలు కురుయుమయ్య
జీవులెల్ల నిన్ను కోరే శాంతి నొసగుమయ్య ॥2॥
మనసులోన నీవే కొలువు దీరవయ్యా
మధుర సుస్వరాల సుధలు కురుయుమయ్య
జీవులెల్ల నిన్ను కోరే శాంతి నొసగుమయ్య ॥2॥
॥ స్వామి అయ్యప్పా!! ॥
🙏 స్వామి అయ్యప్పా 🙏
🙏 స్వామీ అయ్యప్పా 🙏
🙏 స్వామీ అయ్యప్పా 🙏
దేవ దేవ నాపై కరుణ కురియవేల
🪔 స్వామియే శరణం అయ్యప్ప 🪔