🕉️ చూడాలనున్న దయా చూచి తరియించు భాగ్యమయా 🕉️
చూడాలనున్న దయా చూచి తరియించు భాగ్యమయా
నిన్ను చూడాలనుకుంటే వేవేల జన్మాల పుణ్యం వెంటుండాలయ్య
నిన్ను చూడాలనుకుంటే వేవేల జన్మాల పుణ్యం వెంటుండాలయ్య
॥ చూడాలనున్న దయా ॥
స్వామియే శరణమయ్యప్పా
స్వామియే శరణమయ్యప్పా ॥2॥
స్వామియే శరణమయ్యప్పా ॥2॥
🌺 చరణం – 1 🌺
ఆ శబరి గిరిపై ... ఓహో... ఓహో ! ... ఓహో ! ఓహో
ఆ ! శబరి గిరిపైన నీ ! గర్భ గుడిలోన నిను చేరె
ఆ ! నీటి బిందువుకున్నంత నీ పూజ చేసేటి
పత్రంకున్నంత నీ ! పాదముల చెంత
పువ్వుల కున్నంత ॥2॥
ఆ ! శబరి గిరిపైన నీ ! గర్భ గుడిలోన నిను చేరె
ఆ ! నీటి బిందువుకున్నంత నీ పూజ చేసేటి
పత్రంకున్నంత నీ ! పాదముల చెంత
పువ్వుల కున్నంత ॥2॥
ఆ ! పాటి భాగ్యము మాకేది స్వామి
మరుజన్మ మాకుంటే కలిగించు స్వామి
మణికంఠ స్వామి
మరుజన్మ మాకుంటే కలిగించు స్వామి
మణికంఠ స్వామి
స్వామియే శరణమయ్యప్పా
స్వామియే శరణమయ్యప్పా ॥2॥
స్వామియే శరణమయ్యప్పా ॥2॥
॥ చూడాలనున్న దయా ॥
🌺 చరణం – 2 🌺
తనువున్న వరకు... ఓహో .... ఓహో !.... ఓహో !.... ఓహో
తనువున్న వరకు నీ ! కొండకొస్తా
నిండైన రూపాన్ని నే ! చూసి వస్తా
ఒకవేళ నీ ! కొండ రాలేకపోతే
గుడ్డుడినై నా ! కంట నిన్ను చూడకుంటే
అంతటితో ఈ ! జన్మ చాలించు స్వామి
నీ ! పాదముల చెంత చోటివ్వు స్వామి
తనువున్న వరకు నీ ! కొండకొస్తా
నిండైన రూపాన్ని నే ! చూసి వస్తా
ఒకవేళ నీ ! కొండ రాలేకపోతే
గుడ్డుడినై నా ! కంట నిన్ను చూడకుంటే
అంతటితో ఈ ! జన్మ చాలించు స్వామి
నీ ! పాదముల చెంత చోటివ్వు స్వామి
మణికంఠ స్వామి ॥2॥
॥ చూడాలనున్న దయా ॥
స్వామియే శరణమయ్యప్పా
స్వామియే శరణమయ్యప్పా ॥2॥
స్వామియే శరణమయ్యప్పా ॥2॥
🌺 చరణం – 3 🌺
కనులుండి కూడా ... ఓహో... ఓహో !... ఓహో ! ... ఓహో
కనులుండి కూడా కబోదైనాను
మంచేదో చెడుయేదో తెలియక ఉన్నాను ॥2॥
కనులుండి కూడా కబోదైనాను
మంచేదో చెడుయేదో తెలియక ఉన్నాను ॥2॥
పాపాల పుట్టోలె పెరుగుతు ఉన్నాను
ఇహలోక బంధాలలో బందీనైనాను
మోక్షాన్ని నే కోరి వచ్చాను స్వామి
మనసున్న మా ! మంచి మణికంఠ స్వామి
మన్నించు స్వామి
ఇహలోక బంధాలలో బందీనైనాను
మోక్షాన్ని నే కోరి వచ్చాను స్వామి
మనసున్న మా ! మంచి మణికంఠ స్వామి
మన్నించు స్వామి
స్వామియే శరణమయ్యప్పా
స్వామియే శరణమయ్యప్పా ॥2॥
స్వామియే శరణమయ్యప్పా ॥2॥
॥ చూడాలనున్న దయా ॥
🙏 స్వామియే శరణం అయ్యప్ప 🙏