🕉️ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్పా 🕉️
15. ఇదే ఇదే ...
॥ పల్లవి ॥
ఇదే ఇదే శబరిమలక్షేత్రముకలియుగవిభుని కర్మక్షేత్రము
శ్రీధర్మశాస్తుని ధర్మక్షేత్రము
పంచగిరులపై వెలసిన పుణ్యక్షేత్రము
అభీష్టములు నెరవేర్చే అయ్యప్పక్షేత్రము
॥ చరణం ౧ ॥
మహిమల మాలను ధరియించండిమహితాత్ముని దీక్షను పాలించండి
శరణాగతుని శరణాలు ఘోషించండి
చిద్విలాసుని చరణాలు ఆశించండి
॥ చరణం ౨ ॥
నలభై ఎనిమిది దినములునియమంగా మెలగండి
నీలివస్త్రధారుని నిష్ఠగా కొలవండి
అరియంగావు అయ్యను
ఆర్తితో పిలవండి
తారకప్రభువును తనివితీర తలవండి
॥ చరణం ౩ ॥
భక్తవిధేయుని భక్తితో భజించండికాంతిమలవాసుని కీర్తిని కీర్తించండి
ఇరుముడిప్రియుని ఇరుముడులు కట్టండి
వనయాత్రనుచేసి స్వామి సన్నిధికి చేరండి
॥ చరణం ౪ ॥
అభిషేకప్రియుని అభిషేకించండిదివ్యమైన అనుభూతితో
కనులారా కాంచండి
మణికంఠునికి ముడుపులు అర్పించండి
అయ్యప్పస్వామి అండను అర్ధించండి
🕉️ స్వామియే శరణం అయ్యప్ప 🕉️