🕉️ తోడుగ నిలిచే మణికంఠ 🕉️
తోడుగ నిలిచే మణికంఠ మా దైవం నీవే మణికంఠ
భక్తవరదుడా - జ్ఞానరూపుడా - సుందరాంగుడా - సర్వవ్యాప్తుడా
కరుణాలొలుకు నీ కనులకాంతిలో జన్మము తరియించే తోడుగ

🌺 చరణం – 1 🌺
పులిపాలు తెచ్చేవు ఓ బాలుడా
స్వామి పులి వాహనుడవు ఓ వీరుడా
శరణన్న క్షణమందు పలికేవయా
స్వామి శబరిగిరికి జ్యోతివి నీవై వెలిగేవయా
శబరివాసుడా శరణమియ్యరా హరుని పుత్రుడా మమ్ముకావరా
భక్తిమీర నిను కొలుచుకుంటిమి - కరుణను కురిపించూ

॥ తోడుగ ॥
🌺 చరణం – 2 🌺
సర్వేశ్వరుడునూ నీవేనయా
స్వామి సుఖశాంతులన్నీ ఇచ్చేవయా
ఇహలోక బంధాలు విడలేమయా
నిన్ను నిరతము కొలిచే భాగ్యాన్ని మాకియ్యవా
స్వామి సుఖశాంతులన్నీ ఇచ్చేవయా
ఇహలోక బంధాలు విడలేమయా
నిన్ను నిరతము కొలిచే భాగ్యాన్ని మాకియ్యవా
భక్తవరదుడా - జ్ఞానరూపుడా - సుందరాంగుడా - సర్వవ్యాప్తుడా
కరుణలొలుకు నీ కనులకాంతిలో జన్మము తరియించే
కరుణలొలుకు నీ కనులకాంతిలో జన్మము తరియించే
॥ తోడుగ ॥
🙏 స్వామియే శరణం అయ్యప్ప 🙏